Hyderabad: హైదరాబాద్ నగరంలో గుంతల రోడ్లు, బురదలో కూర్చుని నిరసన తెలిపిన మహిళ, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ లో గల ఆనంద్ నగర్ రోడ్డు గుంతలమయం కావడంతో ఓ మహిళ బురదలో కూర్చుని నిరసనకు దిగింది. ఘటన వివరాల్లోకెళితే.. కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు జర్నీ చేస్తుంది.

Hyderabad: Mother protests at Nagole by sitting in a pothole, venting ire over officials who have not taken repair Watch Video

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ లో గల ఆనంద్ నగర్ రోడ్డు గుంతలమయం కావడంతో ఓ మహిళ బురదలో కూర్చుని నిరసనకు దిగింది. ఘటన వివరాల్లోకెళితే.. కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు జర్నీ చేస్తుంది. వాళ్ల పిల్లలు కూడా ఇదే దారిలో రోజు స్కూల్ కు వెళ్తుంటారు. గతంలో ఈమె పిల్లలు ఈ రోడ్డు నుండి వెళ్తూ కింద పడ్డారు. అయితే ఆ సమయంలోనే అధికారులకు ఆమె ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆనంద్ నగర్ చౌరస్తాలోని గుంతలో కూర్చొని ఇవాళ నిరసన తెలిపింది.  వీడియో ఇదిగో, మద్యం లారీ బోల్తా, మందుబాటిళ్లను తీసుకునేందుకు ఎగబడిన జనాలు, బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా జీహెచ్ఎంసీ యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ ఆమెతో ఫోన్ లో మాట్లాడి త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now