Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.
Hyderabad, June 2: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్ కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)