Hyderabad: తల్లీకూతురు చేతిలో చావుదెబ్బలు తిని పరారైంది వీళ్లే, అరెస్ట్ చేసిన పోలీసులు, తల్లిబిడ్డల ధైర్యసాహసాలకు మెచ్చుకుని శాలువాతో సత్కరించిన నార్త్ జోన్ డీసీపీ
హైదరాబాద్ లోని బేగంపేటలో తల్లికూతురు దాడి నుంచి తప్పించుకుని పరారైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దొంగలు సుశీల్ కుమార్, ప్రేమ్ చంద్రలను అరెస్టు చేశారు.తల్లీకూతురు తుపాకులకు ఎదురునిలిచి ఆ దొంగలతో వీరోచితంగా పోరాడారు.
హైదరాబాద్ లోని బేగంపేటలో తల్లికూతురు దాడి నుంచి తప్పించుకుని పరారైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దొంగలు సుశీల్ కుమార్, ప్రేమ్ చంద్రలను అరెస్టు చేశారు.తల్లీకూతురు తుపాకులకు ఎదురునిలిచి ఆ దొంగలతో వీరోచితంగా పోరాడారు. ఇద్దరు ఆగంతకులు నాటు తుపాకీతో ఓ ఇంట్లోకి చొరబడి దోచుకోవాలని చూశారు. కానీ ఆ ఇంట్లోని తల్లీకూతురు ఆ దొంగలను ధైర్యంగా ఎదిరించారు. ఓ దొంగను కింద పడేసి కొట్టి, చేతిలోని తుపాకీని లాక్కున్నారు. దాంతో అతడు భయంతో పారిపోయాడు. మరో దొంగ కూడా కొద్దిసేపటికి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని పైగా కాలనీ ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను తల్లి కూతురు తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరి వీరోచిత పోరాటాన్ని అభినందించేందుకు శుక్రవారం నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ముందుకొచ్చారు. సదరు మహిళ ఇంటికి చేరుకున్న డీసీపీ తల్లి కూతురు ని శాలువాతో సత్కరించారు. వీరి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)