Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్పమాల ధరించిందని బాలికను స్కూలు లోపలికి రానివ్వని యాజమాన్యం, దాదాపు గంటపాటు ఎండలో నిలబడిన పాప
అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూలులోకి అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది
హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం... అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూలులోకి అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది. ఈ విషయమై తండ్రికి సమాచారం ఇవ్వగా.. అసలు తన కూతుర్ని స్కూల్ లోకి ఎందుకు అనుమతించడం లేదని తండ్రి స్వామి నిలదీశారు.
స్కూల్ యూనిఫామ్‌లోనే అనుమతిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆయన స్కూల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. స్కూల్ యాజమాన్యం అడ్డుకుందంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పాపను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను మాల వేసుకున్నానని లోనికి రానివ్వడం లేదని, తాను గంట నుంచి బయట నిలుచున్నట్లు స్వామి మాలలో ఉన్న బాలిక తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)