Hyderabad Rains: భారీ వరదలకు నీట మునిగిన మైసమ్మగూడ, 30 అపార్ట్‌మెంట్లలో ఒకటో అంతస్తు వరకు చేరుకున్న వరద నీరు, పొక్లెయిన్ల సాయంతో విద్యార్థులు బయటకు
భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది.
హైదరాబాద్ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.
భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆందోళన చెందుతున్న విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)