Hyderabad Rains: ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన
నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.
భాగ్యనగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షం మళ్లీ తెలంగాణ రాజధానిని పలకరించింది. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఆ అంచనాకు తగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది.
భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో.. నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ కాగా.. చాలా చోట్ల ఇప్పటికే నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు సాగుతోంది.
Here's Hyderabad Traffic Police Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)