Hyderabad Rains: విషాదకర వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గల్లంతైన ఆ మహిళ జాడ నాలుగు రోజుల తర్వాత, మూసీ నదిలో కొట్టుకువచ్చిన లక్ష్మి మృతదేహం

నాలుగు రోజుల క్రితం హుస్సేన్‌ సాగర్‌ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీ నదిలోకి లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది

Woman washed away in Musi River (Photo-Video Grab)

నాలుగు రోజుల క్రితం హుస్సేన్‌ సాగర్‌ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీ నదిలోకి లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది.కాగా కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.తాజాగా మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు.

గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్‌ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు.

Woman washed away in Musi River (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement