Road Accident Video: వీడియో ఇదిగో, రాయదుర్గంలో వేగంగా వచ్చి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు, స్పాట్‌లోనే స్టూడెంట్ మృతి

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Speeding Car hit flyover wall near Malkam Cheruvu under Raidurgam police station Student Dies

Hyderabad Road Accident: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్‌లోనే మృతి

మృతుడ్ని ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్‌(19)గా పోలీసులు గుర్తించారు. బీఎన్‌ఆర్‌ హిల్స్‌ నుంచి చరణ్‌ మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఫ్లై ఓవర్‌ ఫిల్లర్‌ను ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. కారు నుజ్జు అయ్యి స్పాట్‌లోనే చరణ్‌ చనిపోయాడని, ఇరుక్కుపోయిన ఆ మృతదేహాన్ని కష్టం మీద బయటకు తీసినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిపిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now