Hyderabad Shocker: శంషాబాద్‌లో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అగంతకులు, కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

శంషాబాద్‌లో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది.శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

Woman Dead Body In Burnt Condition At Shamshabad (Phoot-Video Grab)

కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

Woman Dead Body In Burnt Condition At Shamshabad (Phoot-Video Grab)

Here's Videos

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement