Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కృంగిన ఘటనపై కేసు నమోదు, ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహాదేవ్ పూర్ పోలీసులు

మేడిగడ్డ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విద్రోహ శక్తులున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

medigadda

మేడిగడ్డ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో  కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విద్రోహ శక్తులున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ ని కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై కుంగిన పిల్లర్లను నిచ్చెనల ద్వారా క్రిందకు దిగి  డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు పరిశీలించారు. సుమారు 2 గంటలకు పైగా అధికారులు పరిశీలించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లను, వంతెనను పరిశీలించిన తర్వాత  తిరిగి హైదరాబాదుకు కేంద్ర జలసంఘం సభ్యులు బయలు దేరారు. బృందం పరిశీలించిన నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు ఇవ్వనున్నట్లు నేషనల్ డ్యామ్ అథారిటీ బృందం అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now