Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Metro (File: Google)

Hyderabad, July 11: పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు (Metro Train)  త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా (MGBS-Falaknuma) మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ (Metro Connectivity) రాగా.. పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడమే కారణం. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు.

Accident in Prakasam: ప్రకాశంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి