2024 భారతదేశం ఎన్నికలు: ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

పదేళ్లలో ఈ దేశ ప్రజలు ఏం పొందారు.. యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఎంతకాలం ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విద్వేషపు గోడలు కట్టేందుకు అనుమతిస్తారంటూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు

Asaduddin Owaisi and Modi (photo-ANI)

2024 భారతదేశం ఎన్నికలు: పదేళ్లలో ఈ దేశ ప్రజలు ఏం పొందారు.. యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఎంతకాలం ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విద్వేషపు గోడలు కట్టేందుకు అనుమతిస్తారంటూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేవాలయాలు, మసీదుల పేరుతో ఈ దేశంలో ఓటు బ్యాంకును బీజేపీ పొందుతోందని ప్రధాని మోదీ చెప్పారు దాని నుండి ప్రధాని మోదీ తన స్నేహితులకు రూ. 6000 కోట్ల రుణం ఇచ్చారని ఒవైసీ అన్నారు. పాత బస్తీ ప్రజలకు ఎంఐఎం రక్షణగా ఉంటుందని, పాత బస్తీని కొత్త నగరానికి ధీటుగా అభివృద్ధి పరిచే బాధ్యత తనదని పేర్కొన్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును మార్చి భాగ్యనగరంగా మారుస్తామని అంటున్నారని, ఎవడి అబ్బ సొత్తని పేరు మారుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now