లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది.  తెలంగాణలో పోలింగ్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘం, అన్ని పార్టీల విజ్ఞ‌ప్తి మేర‌కు పోలింగ్ స‌మ‌యం పెంపు

దీంతో ఇవాళ బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన చేసిన ఇంద్రకరణ్ రెడ్డి..తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ లో చేరారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)