Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహా శివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శనానికి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ఏ శైవక్షేత్రం చూసినా సరే భక్తుల క్యూలైన్లతో కనిపిస్తోంది. మహా శివరాత్రి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుండి వేములవాడ, కీసరతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు వేశారు ఆర్టీసీ అధికారులు.
Mahashivratri Celebrations 2025 at Vemulawada
Mahashivratri Celebrations 2025 at Telugu states
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)