Telangana Politics: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు.

Mynampally Hanumantha Rao (Photo-Video Grab)

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రే ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటీవలే మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తన కుమారుడు రోహిత్‌కు బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కకపోవడంతో మైనంపల్లికి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now