IPL Auction 2025 Live

KTR Tweet on CorbeVax Vaccine: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా, కార్బివాక్స్ కరోనా టీకాపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పటికే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా విడుదల

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది.

IT Minister kTR (Photo-Twitter)

తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ (Minister KTR Tweet) చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా బయలాజికల్ ఈ కంపెనీ సీఈఓ మహిమ దాట్ల ఆమె బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ కంపెనీ 2022 ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే బయలాజికల్ ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కార్బివ్యాక్స్ కు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అలాగే సీరం అభివృద్ధి చేసిన కొవొవ్యాక్స్ టీకాకు, అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ తయారు చేసిన మోల్నుపిరవర్ యాంటీ వైరల్ గోలికి కూడా అనుమతి ఇచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)