Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం

హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు

Hari Babu Kambhampati (photo-File Image)

మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కాగా కంభంపాటి హరిబాబు 2014 నుంచి 2019 వరకు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2021లో మిజోరం గవర్నర్‌గా హరిబాబు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.  ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif