MLA Rajasingh Got Bail: MLA రాజాసింగ్‌కు బెయిల్, విడుదల చేయాలని కోర్టు ఆదేశం
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి కోర్టు..బెయిల్ మంజూరు చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి కోర్టు..బెయిల్ మంజూరు చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. 41 సీఆర్పీసీపై 45 నిమిషాలపాటు ఇరువర్గాలు వాదనలు కొనసాగించాయి. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించనందుకు రాజాసింగ్ రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)