Hyderabad Rains: హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఖమ్మంలో 180 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని. హైదరాబాద్‌కు ఐఎండీ భారీ వర్షసూచన చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)