Nalgonda Road Accident: దేవుని దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే మృతి,వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన లారీ

మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం (Nalgonda Road Accident) చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్‌ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident (Photo-Video Grab)

మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం (Nalgonda Road Accident) చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్‌ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన ( Five Members of Two Families Killed) వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుకుపల్లి మహేశ్‌ (32), ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(6), మహేష్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మహేందర్‌(32), అతని కుమారుడు లియాన్సీ(2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్‌ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడ్డారు. మాధవిని మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement