Nalgonda: పెట్రోల్ బంకు మోసం, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎస్సై ఉల్టా బెదిరింపు..నయీమ్ బతికుంటే మీ ఆటలు సాగేవి కావు అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశానని ఎస్సై కామెంట్..ఆడియో వైరల్

కట్టంగూరు మండలం NH 65 రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. టాటా టియాగో కారు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు కాగా రీడింగ్‌లో 42 లీటర్లు చూపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Scam At Petrol Bunk In Nalgonda, SI Audio call goes viral(X)

కట్టంగూరు మండలం NH 65 రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. టాటా టియాగో కారు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు కాగా రీడింగ్‌లో 42 లీటర్లు చూపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే బంకు యాజమాన్యంతో కుమ్మక్కైన ఎస్‌ఐ రవీందర్ బాధితులపైనే బెదిరింపులకు పాల్పడ్డారు. నయీమ్ బతికుంటే మీ ఆటలు సాగేవి కావు అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపైనే ఎస్‌ఐ చిందులు వేశారు. నయీమ్ ను అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశానంటూ కామెంట్స్ చేయగా ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.  ఆగి ఉన్న మద్యం లారీని ఢీకొట్టిన మరో లారీ, ఒకదాని వెంట ఒకటి ఢీకొట్టుకున్న మరో నాలుగు లారీలు, వీడియో ఇదిగో.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement