Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్

ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

Nita Ambani (Credits: X)

Hyderabad, Mar 28: ఐపీఎల్ (IPL) లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నీతా అంబానీ నిన్న హైదరాబాద్ వచ్చారు. మన నగరంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మ్యాచ్ కు బయల్దేరడం ఆమెకు సెంటిమెంట్. ఈ క్రమంలోనే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీ దాదాపు 15 నిమిషాల పాటు అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు.

IPL 2024, SRH vs MI : ఉత్కంఠ పోరులో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం, 31 పరుగుల తేడాతో గెలుపు..రికార్డు టార్గెట్ ఛేదనలో పోరాడి ఓడిన ముంబై..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement