Parliament Special Session: మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన, వీడియో ఇదిగో..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ ఉభసభల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ ఉభసభల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉభయసభల్లో రిజర్వేన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.అంతకుముందు పార్లమెంట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ ఎంపీల నిరసన తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)