Parliament Winter Session: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలి, లోక్‌సభలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు. ఖరీఫ్‌ పంటను కేసీఆర్‌ కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు హితవు పలికారు.

Telangana PCC chief Chief Uttam Kumar Reddy | (Photo Credits: ANI)

వ‌రుస‌గా మూడో రోజు కూడా విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీల‌తోపాటు ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేక‌ర‌ణ‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌, ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన రైతుల‌కు ప‌రిహారం విష‌య‌మై స‌భ‌లో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు. ఖరీఫ్‌ పంటను కేసీఆర్‌ కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గోనె సంచులు కొనుగోలు చేయలేదు& రవాణా కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement