Telangana Weather Update: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, అరెంజ్ అలర్ట్ జారీ చేసిన రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ

ఈ ఏడాదిలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

Heat wave. Representational Image. (Photo Credits: Pixabay)

తెలంగాణలో మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వెంట్రుక కూడా పీకలేవంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతారంటూ జోస్యం

ఇక రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీచేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)