KTR vs Revanth Reddy (Photo- File Image)

Hyd, Mar 26: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు (KTR Slams CM Revanth Reddy) చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.

దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ (BJP) శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ ఒక్కటేనంటూ అసత్య ప్రచారం చేసి, మైనార్టీ సోదరులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌పై (Congress) విమర్శలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆధారాలుంటే కిషన్‌రెడ్డి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..

రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు... వెంట్రుక కూడా పీకలేవ్" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అయిదేళ్ల కాలంలో కిష‌న్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి ప‌ని చేయ‌లేద‌ని... కిస్మ‌త్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్‌ను ప్రజలు గెలిపించారన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారన్నారు.

Here's Videos

అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్‌ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు.

ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన గొప్ప పనులు మూడంటే మూడు చేశారని విమర్శించారు. కరోనా వస్తే చాలామంది అన్నదానాలు చేశారని, అంబులెన్స్ లు ఇచ్చారనీ, కిషన్ రెడ్డి మాత్రం కుర్‌కురేలు పంచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, కిషన్ రెడ్డి సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో రెండు లిఫ్ట్‌లు ప్రారంభించారని, నాంపల్లిలో సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మూసీకి వరద వస్తే కిషన్ రెడ్డి రూపాయి తేలేదని విమర్శించారు.

కనీసం అంబర్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కాలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల బైరామల్‌గూడలో ప్రారంభించిన ఫ్లైఓవర్ మనం కట్టించిందే అని చెప్పారు. కిషన్ రెడ్డికి ఓటేయాలని ఎవరైనా చెబితే అంబర్‌పేట ఫ్లైఓవర్ చూసి రమ్మనాలని సూచించారు. కిషన్ రెడ్డి ఇష్టంవచ్చినట్లు నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పదేళ్లు దేశానికి మోదీ ఏం చేశారని చెప్పడానికి కిషన్ రెడ్డి వద్ద ఏమీ లేదన్నారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి జంప్ అవడం ఖాయమని... ఇది రాసిపెట్టుకోవచ్చునని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 లోక్ సభ స్థానాలు దాటే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడే ప్రతి మాటకు రేవంత్ రెడ్డి స్పందిస్తుంటాడని... కానీ బీజేపీలోకి వెళతావనే తన ఆరోపణకు మాత్రం స్పందించడం లేదన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు డబ్బుల కోసం రైస్ మిల్లర్లను, బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందరినీ బెదిరిస్తూ ఢిల్లీకి రూ.2,500 కోట్లు జమ చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్‌ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు.

బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ అంటే రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త అని హెచ్చరించారు.