PM Modi Tweet on KCR Health: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్, ఫాంహౌస్‌ బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో గాయం, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.

CM KCR at Yoshada Hospital (Photo-ANI)

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Here's PM Modi Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement