Telangana: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, పలు దేవాలయాలను సందర్శించిన రాష్ట్రపతి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు
పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు .రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Here's Kishan Reddy Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)