Waiters Attack on Customers: వెంటనే వారిని అరెస్ట్ చేయండి, లేదంటే ఆ హోటల్‌కు నిప్పు పెడతామంటూ రాజాసింగ్ హెచ్చరిక

కస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.

MLA Raja Singh (Photo-Video Grab)

హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now