Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు. కానీ ఈ విషయాన్ని తానెక్కడ పబ్లిసిటీ చేసుకోలేదని వివరించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.సినిమా షూటింగ్ ముగించుకుని ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని జగపతిబాబు ఆ వీడియోలో తెలిపారు. రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అవాస్తవమని ఆయన తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు
Revathi’s Family Has No Support from the Film Industry Are False” - actor Jagapathi Babu
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)