MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు. అక్కడ గుండె పోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు స్టంట్ వేయగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్‌కు రానున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ పెద్దలు ఆరా తీయగా పార్టీ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరుకుంటున్నారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS. ఈ మేరకు దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది ప్రముఖ డాటా సంస్థ CtrlS. రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద డాటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. బిగ్ బ్రేకింగ్... తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ
Secunderabad MLA Padmarao Goud suffers heart attack
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గుండెపోటు