M Satyanarayana Rao Died: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం, కరోనాతో సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు (M Satyanarayana Rao Died) ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు.

M Satyanarayana Rao Died (Photo-Twitter)

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన ఎమ్మెస్సార్.. (M Satyanarayana Rao)ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో ఎమ్మెస్సార్‌ మంత్రిగా పనిచేశారు.

అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎమ్మెస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌తో 2006లో తొలిసారి తెలంగాణ కోసం కేసిఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెస్సార్ సహకరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement