South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు, రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి

మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

MMTS(Photo-Twitter/South Central Railway)

హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్‌ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్‌ రైళ్ల వివరాలకొస్తే..

లింగంపల్లి-హైదరాబాద్,

హైదరాబాద్-లింగంపల్లి,

ఫలక్‌నుమా-లింగంపల్లి

లింగంపల్లి-ఫలక్‌నుమా

ఆర్సీ పురం-ఫలక్‌నుమా

ఫలక్‌నుమా-ఆర్సీ పురం

ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Here's South Central Railway Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)