Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో
ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ సమయం అయిపోగానే విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
అయితే ఒకటో తరగతి విద్యార్థి శరత్ నిద్రపోవడంతో గదిలోనే ఉండిపోయాడు(Student Inside Classroom). సాయంత్రం 3:30గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేష్ పాఠశాలకు వెళ్లి వెతికాడు.
ఈ క్రమంలో ఓ తరగతి గది కిటికి తెరచి చూడగా శరత్ నిద్రించి కనిపించగా.. వెంటనే గది తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా టీచర్ల తీరును తప్పుబడుతున్నారు నెటిజన్లు.
Teachers Lock Up First class Student Inside Classroom and Leave
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)