Gudem Mahipal Reddy Joins Congress: బీఆర్‌ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, 10కి చేరిన మొత్తం గోడ దూకిన ఎమ్మెల్యేల సంఖ్య

బీఆర్‌ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు.

BRS MLA Gudem Mahipal Reddy joins Congress

తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.తాజాగా బీఆర్‌ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌.  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో

ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరారు. గూడెం మహిపాల్‌ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now