Telangana Assembly Election 2023: మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా, తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి

ఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు.

Uppal BRS MLA Subhash Reddy (Photo-Video Grab)

ఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు. తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు చేసిన వారికి టికెట్ ఇస్తారా? అని ఆరోపించారు.

ఈ రోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్నించారు. ‘‘ఏం పాపం చేశానని నన్ను తీసేశారు? ఏమైనా తప్పు చేస్తే చెప్పండి. మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా? ఉరి శిక్ష పడిన ఖైదీ ఆఖరి కోరిక అడిగి ఉరి తీస్తారు. నాకు అలాంటి చాన్స్ కూడా లేదా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. నేనేమైనా కబ్జాలు చేశానా? లేక దళితబంధులో కమీషన్లు తీసుకున్నానా? అని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఇంకా కొన్నిరోజులు ఎదురుచూస్తానని చెప్పారు. వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

Uppal BRS MLA Subhash Reddy (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now