MLA Rajaiah Crying Video: వీడియో ఇదిగో, టికెట్ దక్కకపోవడంతో భోరున ఏడ్చేసిన రాజయ్య, కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని స్పష్టం చేసిన స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌ దక్కకపోవడంపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.

mla-thatikonda-rajaiah-gets-emotional-station-ghanpur (photo-Video Grab)

అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌ దక్కకపోవడంపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.కాగా ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు

టికెట్‌ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు.

mla-thatikonda-rajaiah-gets-emotional-station-ghanpur (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now