Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీలో ముసలం, మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు, వేయించింది ఎవరంటే..
సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంపై పారాచూట్‌గా వచ్చి వాలుతున్నారంటూ పోస్టర్లు అంటించారు. గో బ్యాక్ నిజామాబాద్’ అంటూ పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. మధుయాష్కీపై పోస్టర్లు వేయిచింది ఎల్బీనగర్‌కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు ప్రాథమికంగా గుర్తించారు.
దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మధు యాష్కిగౌడ్ కోరారు.ఇక 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి బరిలోకి దిగిన మధుయాష్కీ.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిచెందారు.
Heres' Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)