Telangana Assembly Elections 2023: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి
ఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శుక్రవారం ఉదయం గంటన్నర పాటు సమావేశమైన సీఈసీ 53 స్థానాల అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Here's Congress Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)