BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

BRS Vs Congress Big Fight in Telangana Assembly (Photo-X/Congress)

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకురావడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేసింది. అందులో ఎవరు..ఎవరిపై... అసెంబ్లీలో దాడి చేశారో మీరే చూడండి. ఒక్కసారిగా స్పీకర్ వైపు దూసుకెళ్లిన హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్. స్పీకర్ పైకి పేపర్లు విసిరిన ఎమ్మెల్యే వివేకానంద అంటూ రాసుకొచ్చారు.

రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని, ఫార్ములా -ఈ రేస్ కేసుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

BRS Vs Congress Big Fight in Telangana Assembly 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement