Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

BRS MLA Harish Rao (Photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్ఆర్‌బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51 వేల 277 కోట్లు. ఈ రోజు ఉద‌యం రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. ఈ రోజుకు క‌లిపితే ఇంకో రూ. 3 వేల కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 55, 277 కోట్లు తీసుకున్న‌ట్లు రిపోర్టు ఉంది. కార్పొరేష‌న్ గ్యారెంటీల కింద రూ. 61,991 కోట్లు, మ‌రో రూ. 10,099 కోట్లు గ్యారెంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే రూ. 1,27,208 కోట్లు.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్

Harish Rao on Debts 

Deputy CM Bhatti on Debts

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement