తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

BRS MLAs arrive at Telangana Assembly wearing black clothes and handcuffs

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)