Adilabad: పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీగా కళ్యాణ లక్ష్మీ డబ్బులు..ఆదిలాబాద్‌లో బ్యాంకు సిబ్బంది నిర్వాకం, బాధితురాలు కంటతడి
తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.
తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.
ఆదిలాబాద్ - సిరికొండ మండలం లచ్చింపూర్(బి)కు చెందిన పెందూర్ సోంబాయికి ఆరుగురు కూతుర్లు.. అందులో రెండో కుమార్తె హీరాదేవికి గతేడాది వేసవిలో వివాహం చేసింది. కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా వచ్చిన చెక్కును బ్యాంకు(Crop Loan)లో వేయగా అప్పుకు వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకుంది సిబ్బంది.
విషయం తెలుసుకున్న మహిళ బ్యాంకుకు వెళ్లి డబ్బులు అడగడంతో పంట అప్పు కోసం తీసుకున్న వడ్డీ కింద రూ.60 వేలు పట్టుకొని మిగతా రూ.40 వేలు ఆమె చేతిలో పెట్టారు. దీంతో కంటతడి పెట్టుకొని బ్యాంక్ నుండి వెళ్లిపోయిన సోంబాయి. విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Telangana Bank Deducts Kalyana Lakshmi Funds for Loan Interest