Flex On Bellampalli MLA: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య కామ పిశాచి, బీఆర్ఎస్ భవన్ ఎదుట ఫ్లెక్సీలు కలకలం, ఆరిజన్‌ డెయిరీ పేరుతో బ్యానర్లు ఏర్పాటు

బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు.

Flexi On Bellampalli MLA

హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్‌ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్‌, కేటీఆర్‌, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది.కాగా ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్‌ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Flexi On Bellampalli MLA

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)