Telangana: షాకింగ్ వీడియో... అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ మండిపడిన టీఆర్ఎస్

అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. చెప్పులు అందించడంపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ నేత అద్ధంకి దయాకర్‌ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bandi-Sanjay

అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. చెప్పులు అందించడంపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ నేత అద్ధంకి దయాకర్‌ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement