Eatala Rajender Father Dies: అనారోగ్యంతో ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతి, తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన హుజురాబాద్ ఎమ్మెల్యే

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Eatala Rajender Father Dies

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పితృవియోగంపై ఈటల రాజేందర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. సంతాప సూచికంగా.. కమలాపూర్‌తో పాటు హనుమకొండలో ఇవాళ బిజెపీ చేపట్టాల్సిన నిరసన దీక్షలు రద్దు అయ్యాయి.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్‌ డెడ్‌కు గురయ్యారు. ఇక ఈటల మలయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement