Rajender Meets Amit Shah: ఈటెల రాజేందర్‌కు కీలక పదవి.., హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఆదివారం రాత్రి ఢిల్లీలో షాను కలిసిన ఈటల.. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించానని తెలిపారు.
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో షాను కలిసిన ఈటల.. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించానని తెలిపారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కూడా షాతో మాట్లాడినట్టు తెలిపారు. ఈటల ఉన్నట్టుండి షాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనను పక్కనబెట్టారని దాంతో రాష్ట్ర నాయకత్వంపై ఈటల అసంతృప్తితో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న షా.. ఈటలను ఢిల్లీ రప్పించుకొని ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని, అందులో భాగంగానే షా నుంచి ఈటలకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)