Telangana: వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలామందికి తలలు పగిలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ లోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన పెళ్లి విందులో ఇరు వర్గాలకు చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడడంతో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.
భోజనం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారికి సరిగ్గా వడ్డించడం లేదని మరో వర్గానికి చెందిన వ్యక్తులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ ముదిరి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఫంక్షన్ హాల్‌కు చేరుకుని శాంతింపజేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)