Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే
కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, జిల్లా పరిషత్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు, తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న
గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడ్డారు. ‘నువ్వెంత నీ కథ ఎంత.. ఎక్కువ రోజులు ఉండవ్.. పోరా బై పో’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైనా తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)