Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు. నంబర్ ప్లేట్లు లేని కారుతో పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతున్నారని పోలీసులకు తెలిపారు.సోమవారం అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసి బూతులు తిట్టారని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. సంయమనం పాటించిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీ హిల్స్ పోలీసులకు అందించారు.జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)